తెలంగాణ... మంచిర్యాల జిల్లాలో... నెమళ్ల మృతి కలకలం రేపుతోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు నెమళ్లు ఒక్కసారిగా చనిపోవడం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీరాంపూర్ R K 5 గని దగ్గర్లోని అడవిలో వాగు దగ్గర ఏడు నెమళ్ళు చనిపోయి పడి వున్నాయి.
వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడేందుకు వడ్ల గింజల్లో విషం పెట్టి ఉంటారనీ... వాటిని తిని నెమళ్ళు చనిపోయి ఉంటాయనే అనుమానం ఉంది.
నెమళ్లను పోస్ట్ మార్టం కోసం తరలించారు. అలాగే వడ్ల గింజల్నీ, వాగులో నీటినీ టెస్టింగ్ కోసం తీసుకెళ్లారు.
ఈ నెమళ్లు వేటగాళ్ళ ఉచ్చుకు బలయ్యాయా లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న దానిపై ఈ వారంలోనే కనుక్కుంటామంటున్నారు అధికారులు,